ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో కిడ్నీలో రాళ్లు అతి సాధారణమైన సమస్యగా మారుతుంది. ప్రపంచ జనాభాలో 10 నుంచి 15 శాతం మంది ఈ సమస్యతో బాధపడితే మన దేశంలో 5 నుంచి 7 మిలియన్ల ప్రజలు కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. మూత్రపిండాల్లో మినరల్స్ స్పటిక రూపంలో ఏర్పడటాన్ని కిడ్నీ స్టోన్స్ అంటారు. మొత్తంగా చెప్పాలంటే ఆరోగ్యం మరియు దాని శ్రేయస్సు అంతా కిడ్నీలపైనే ఆధారపడి ఉంటుంది.
కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి గల కారణాలు
కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ఒక ప్రత్యేక కారణం అంటూ ఏమి లేదు. అనేక కారణాల ఫలితంగా శరీరంలో అవి అభివృద్ధి చెందుతాయి.
ఈ కింది కారణాల వల్ల కూడా కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- కిడ్నీలో రాళ్ళు వంశపారంపర్యంగా కూడా వస్తాయి.
- వ్యాయామం చేయకపోయినా, మధుమేహంతో బాధ పడుతున్నవారికి రాళ్లు అధికంగా వస్తాయి.
- ప్రతిరోజూ తగినంత నీరు త్రాగకపోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.
- కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి మరొక ప్రధాన కారణం ఉప్పు, కాల్షియం మరియు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు తీసుకోవడం కూడా ఒకటి.
- తగినన్ని నీళ్ళు త్రాగకపోవడం (శరీరంలో వ్యర్థాలను చాలా తక్కువగా బయటకు పంపడం) వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
- మూత్రపిండాల రాళ్ళు ఏర్పడటానికి ఊబకాయం మరొక కారణం, ఇది మూత్రంలో ఆమ్ల స్థాయిలను మార్చి రాళ్ళు ఏర్పడటానికి దారితీస్తుంది.
కిడ్నీ స్టోన్ యొక్క సంకేతాలు & లక్షణాలు
కిడ్నీ స్టోన్ మీ కిడ్నీ లోపల కదిలే వరకు లేదా మీ మూత్రనాళంలోకి వెళ్లే వరకు సాధారణ లక్షణాలే అనిపిస్తాయి.ఒక వేళ కిడ్నీలో రాళ్లు మీ మూత్రనాళంలోకి వెళ్తే మాత్రం ఈ క్రింది లక్షణాలు కనిపిస్తాయి.
- పక్కటెముకల క్రింద వైపు మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.
- పింక్, ఎరుపు లేదా గోధుమ రంగులో దుర్వాసనతో కూడిన మూత్రం రావడం జరుగుతుంది.
- వికారం మరియు వాంతులు, నిరంతరం మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తాయి.
- ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే జ్వరం మరియు చలి, సాధారణం కంటే తరచుగా మూత్రవిసర్జన వస్తుంటుంది.
- రాళ్లు మూత్ర నాళంలో కదులుతున్నప్పుడు నొప్పి వేరే ప్రదేశానికి మారడం వంటి లక్షణాలు కూడా అనిపిస్తాయి.
కిడ్నీలో రాళ్లు రాకుండా నివారించుకోవడం ఎలా.?
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జీవనశైలిలో అనేక మార్పులు చేసుకోవాలి.
అందులో ముఖ్యంగా ఎక్కువగా నీళ్ళు తాగాలి. (రోజుకు కనీసం 2 నుండి 2.8 లీటర్ల నీళ్లు తాగాల్సి ఉంటుంది)
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, అలాగే సాల్ట్ ఫుడ్స్ & జంక్ పుడ్స్ను ఎక్కువ తీసుకోకూడదు.
తినే ఆహారంలో ఉప్పు పరిమాణం తక్కువగా తీసుకోవడం మంచిది.
క్యాల్షియం సప్లిమెంట్ లను తీసుకోవడానికి ముందు డాక్టర్ ను సంప్రదించి తగు సలహాలు, సూచలనలను పొందడం ఉత్తమం.
కిడ్నీలో రాళ్లు ఉన్నాయనగానే కొందరు రకరకాల ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆహారంలో మార్పులు చేసుకోవడం, అతిగా మంచినీళ్లు తాగడానికి సిద్ధమవవ్వడం వంటి వాటివి చేస్తుంటారు. అంతేకాక కిడ్నీలో రాళ్లు ఉన్నాయి అనగానే ఏం తినాలన్నా సంకోచిస్తారు.
అయితే ఆరోగ్యానికి సహకరించే ఆహారం తీసుకోవడం, తగు వ్యాయమాలు చేయడం వల్ల శరీర బరువును అదుపులో ఉంచుకోవడమే కాక, కిడ్నీలను కూడా పలు రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. అయితే కిడ్నీలు శరీరంలో ముఖ్యమైన విధులను నిర్వర్తిసాయి కావున వీటి సంరక్షణకు అందరూ తగు జాగ్రత్తలు పాటించడం ఎంతో ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.